Clarifications about Vacation and Short term holidays Prefix-Suffix

Clarifications about Vacation and Short term holidays Prefix-Suffix

అసలు ఏమిటి ఈ Vacation and Short term holidays ?

        15 రోజులకు మించిన సెలవులను వెకేషన్ హాలిడేస్ (ఉదాహరణ: వేసవి సెలవులు) అంటారు. 15 రోజుల కన్నా తక్కువ ఉన్న సెలవులను షార్ట్ టర్మ్ హాలిడేస్ (ఉదాహరణ: దసరా లేదా సంక్రాంతి సెలవులు) అంటారు. వెకేషన్ హాలిడేస్ లో ముందు రోజు గానీ, ఓపెన్ రోజు గానీ (రెండింటిలో ఒక్కటి మాత్రమే) హాజరు అయితే సరిపోతుంది. షార్ట్ టర్మ్ హాలిడేస్ కు ముందు, ఓపెన్ రోజు తప్పక వెళ్లాలి. షార్ట్ టర్మ్ హాలిడేస్ 10 రోజుల కన్నా తక్కువ ఐన ముందు రోజు గానీ, ఓపెన్ రోజు గానీ (రెండింటిలో ఒక్కటి మాత్రమే) సాధారణ సెలవు పెట్టుకోవచ్చు. (Clarifications about Vacation and Short term holidays Prefix-Suffix)

         వెకేషన్ హాలిడేస్ లో ముందు రోజు (Last working day) గానీ, ఓపెన్ రోజు (Reopening day) గానీ బడికి హాజరు కానప్పుడు సాధారణ సెలవు ఇవ్వకూడదు. సంపాదిత/అర్థ వేతన సెలవు మాత్రమే మంజూరు చేయాలి. C&DSE Rc.No.815/E1/1999 తేది:01-09-1999 ప్రకారం టర్మ్ హాలిడేస్ 14 రోజులకు మించిన సందర్భంలో PREFIX, SUFFIX చేసుకునుటకు అవకాశం కలదు. చివరి పనిదినం, రీ ఓపెనింగ్ డే లలో ఏదో ఒక రోజు హాజరు కానిచో ఆ రోజు అర్హతగల సెలవు (CL మరియు CCL కాకుండా) పెట్టుకోవచ్చును.

       వేసవి సెలవుల సందర్భంలో Closing day లేదా Reopening day రోజుల్లో ఒక్కరోజు హాజరు అయితే వెకేషన్ మొత్తాన్ని PREFIX / SUFFIX చేస్తారు. ఒక సమయంలో సెలవుకు PREFIX గాని SUFFIX గాని ఎదో ఒక్కటి మాత్రమే వర్తిస్తుంది.

దసరా / సంక్రాంతి సెలవుల సమాచారం

  • దసరా/సంక్రాంతి సెలవులు 9 రోజులు ప్రకటించినపుడు (ఆదివారంతో కలిపి) చివరి రోజు గానీ, తెరిచే రోజు గానీ (రెండింటిలో ఒకటి మాత్రమే) సాధారణ సెలవు (CL) పెట్టుకోవచ్చు.
  • Rc.No.10324/E4-269, dt.7-11-1969 ప్రకారం టర్మ్ హాలిడేస్ (దసరా/సంక్రాంతి సెలవులు) 10 రోజులకు పైబడి 15 రోజులకు మించకుండా ఉన్న సందర్భంలో Prefix, Suffix వర్తించదు. చివరి పనిదినం / పునఃప్రారంభం రోజు రెండు రోజులు పాఠశాలకు హాజరవ్వాలి. ఒకరోజు హాజరుకాకున్నా సెలవులన్ని Other than CL గా పరిగణించబడతాయి. అనగా EL/MCL/HPL/EOL లలో ఏదో ఒకటి పెట్టవలసి ఉంటుంది.
  • దసరా/సంక్రాంతి సెలవులు 15 లేక అంతకంటే ఎక్కువ రోజులు (ఆదివారంతో కలిపి) ప్రకటించినపుడు బడి చివరి రోజు గానీ, బడి తెరిచేరోజు గానీ (రెండింటి లో ఒక రోజు మాత్రమే) అర్హత గల సెలవు పెట్టుకోవచ్చు. అర్హత గల సెలవు అనగా EL/HPL/MCL లలో ఒకటి 1 రోజు కోసం వాడుకోవచ్చు.
ఈ సంవత్సరం దసరా సెలవులు 02.10.2024 నుండి 13.10.2024 వరకు అనగా 12 రోజులు కావున 1వ తేదీ Closing day మరియు 14వ తేదీ Reopening day తప్పనిసరిగా పాఠశాలకు హాజరుకావలెను.

ప్రశ్నలు – జవాబులు

ప్రశ్న: ఒక టీచర్ 22 రోజులు మెడికల్ లీవ్ లో ఉన్నాడు. 23వ రోజు జనరల్ హాలిడే, 24 వ రోజు రెండవ శనివారం మరియు 25వ రోజు ఆదివారం. ఇప్పుడు 25 రోజులకు మెడికల్ సర్టిఫికెట్ తీసుకురావాలా? లేదా 23 రోజులకు తీసుకురావాలా? Prefix, suffix మెడికల్ లీవ్ లకు వర్తిస్తాయా?

జవాబు: FR 68; FR 71 మరియు AP Leave Rules ప్రకారం Fitness Certificate ఎన్ని రోజులకు తీసుకున్నారన్నదే ముఖ్యం.

  1. 22 రోజులకు Fitness Certificate ఇస్తే, 22 రోజులకు మెడికల్ లీవ్ మరియు 3 రోజులకు suffix చేసుకోవచ్చు. 22 రోజులు మెడికల్ లీవ్ లు తగ్గించ బడతాయి.
  2. 25 రోజులకు Fitness Certificate ఇస్తే, suffix ఉండదు. 25 రోజులు మెడికల్ లీవ్ లు తగ్గించ బడతాయి.

ప్రశ్న: OH, ఆదివారాలను కూడా suffix, prefix గా వాడుకోవచ్చా?

జవాబు: Govt. Memo No.86595/1210/FR17, dated:29.5.81 ప్రకారం ఐచ్చిక సెలవు దినాలు, పరిహార సెలవు దినాలను suffix లేదా prefix గా వాడుకోవచ్చు.

Detailed..

Govt. Memo No.86595/1210/FR17, dated:29.5.81 & Rc.No.10324/E4-269, dt.7-11-1969

DOWNLOAD

error: Content is protected !!