Chhatrapati Shivaji Biography

Chhatrapati Shivaji Biography

చత్రపతి శివాజీ

ఛత్రపతి శివాజీగా ఖ్యాతి పొందిన శివాజీ రాజే భోంస్లే (ఫిబ్రవరి 19, 1627 – ఏప్రిల్ 3, 1680) పశ్చిమ భారతదేశాన మరాఠా సామ్రాజ్యాన్ని నెలకొల్పి మొఘల్ సామ్రాజ్యాన్ని ఎదిరించాడు. భారతదేశ చరిత్రలో గొప్ప యోధులు, సువర్ణాక్షరాలతో లిఖించబడిన పేర్లలో ఛత్రపతి శివాజీ పేరుకు ఎంతో ప్రత్యేకత ఉంది. నిస్వార్థంగా ప్రజలకు సేవచేయడం, తాను చేస్తున్న పనిపట్ల అంకితభావం, మచ్చలేని వ్యక్తిత్వం తో ఆయన అనుచరులకు, ప్రజలకు ఆదర్శంగా నిలిచాయి. సుదీర్ఘ యుద్ధ కాలంలో లెక్కలేనన్ని యుద్ధాలు చేసినా ఎన్నడూ పవిత్రస్థలాలను ధ్వంసం చేయలేదు. భారతదేశం లో హిందూమతాన్ని కాపాడిన ఘనత ఒక్క మరాఠా మహారాజు శివాజీకే దక్కుతుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అందుకే ఆ యోధుడి జన్మదినోత్సవాన్ని భారతదేశ వ్యాప్తంగా ఒక వేడుకలా జరుపుకుంటారు. ముఖ్యంగా మహారాష్ట్రలో ఒక పండుగలా నిర్వహిస్తారు. Chhatrapati Shivaji Biography

Chhatrapati Shivaji జననం

శివాజీ గారు ఫిబ్రవరి 19, 1627 న పూణే జిల్లాలోని జున్నార్ పట్టణం దగ్గర శివనేరీ కోటలో షాహాజీ మరియు జిజాబాయి పుణ్య దంపతులకు జన్మించాడు. వీరు మహారాష్ట్రలోని వ్యవసాయం చేసుకునే భోస్లె కులానికి చెందినవారు. జిజాబాయికు శివాజీ పుట్టకముందు పుట్టిన వారంతా చనిపోవడంతో, ఆమె శివపార్వతులను పూజించగా శివాజీ క్షేమంగా ఉన్నాడు. దీంతో ఆయనకు శివాజీ అనే పేరు పెట్టారు.

శివాజీ తల్లి శివాజీ చిన్నప్పటినుండి భారత రామాయణ బలి చక్రవర్తి గాథలు చెప్పి వీర లక్షణాలు వచ్చే విధంగా చేసింది. స్త్రీల పట్ల గౌరవం మరియు పరమత సహనన్నీ తన తల్లి వద్దనే నేర్చుకున్నాడు. సకల విద్యలు నేర్చుకున్న శివాజీ మరాఠా సామ్రాజ్య స్థాపనే లక్ష్యంగా తన వ్యూహాలు మొదలుపెట్టాడు. తన తండ్రి అయిన షాహాజీ పొందిన పరాజయాలను క్షుణ్ణంగా అధ్యయనం చేసి, అనతికాలంలోనే శివాజీ యుద్ధ తంత్రాలలో గొప్ప యోధుడు అయినాడు. అప్పుడే సరికొత్త యుద్ధ తంత్రాలను నేర్చుకున్నాడు.

యుద్ధాలు

అఫ్టల్ ఖాన్ శివాజీని రెచ్చగొట్టడానికి శివాజీ ఇష్టదైవమైన భవానీ దేవి ఆలయాలను కూల్చాడు. ‘‘ఓటమి తప్పదు అనిపిస్తే యుద్ధం నుంచి తప్పుకోవాలి.. అనుకూల సమయాన్ని చూసి దాడి చేసి గెలవాలి’’ అనే గెరిల్లా యుద్ధ తంత్రం తెలిసిన శివాజీ తాను యుద్ధానికి సిద్ధంగా లేనని ప్రతాప్ ఘడ్ కోట దగ్గర చర్చలకు ఒప్పుకున్నాడు. అఫ్టైల్ ఖాన్ సంగతి తెలిసిన శివాజీ ఉక్కు కవచాన్ని ధరించి పిడిబాకు లోపల దాచుకున్నాడు. చర్చలు జరుపుతుండగా అఫ్టల్ ఖాన్ కత్తితో శివాజీ పై దాడి చేసి పారిపోతుండగా ఒకే వేటుకు అఫ్టల్ ఖాన్ తల నరికేశాడు శివాజీ. ఈ విజయంతో శివాజీ మరాఠా యోధుడిగా మహారాష్ట్ర అంతా పేరు తెచ్చుకున్నాడు.

బీజాపూర్ సుల్తాన్ ఎలాగైనా శివాజీని అణచాలని, యుద్ధ వీరులు గా పేరు తెచ్చుకున్న ఆఫ్ఘన్ పస్థున్ సైనికులను పంపించగా శివాజీ సేన వేల సంఖ్యలో వస్థూన్లను చంపి విజయం సాధించింది. ఈ సంఘటనతో శివాజీ కీర్తి ప్రతిష్టలు భారతదేశం అంతా వ్యాపించాయి ఎందరో రాజులకు శివాజీ ఆదర్శంగా నిలిచాడు.

ఇది సహించలేని బీజాపూర్ సుల్తాన్ అరబ్, పర్షియా, ఆఫ్గాన్ నుండి 10,000 మంది కిరాయి సైనికులను శివాజీని అంతం చేయడానికి పంపగా శివాజీ తన వద్దనున్న 5,000 మరాఠా యోధులతో కలిసి కొల్హాపూర్ వద్ద ఎదుర్కొన్నాడు. శివాజీ యుద్ధ రంగంలో విజృంభించి శత్రువులను హతమార్చాడు. ఈ విజయంతో సుల్తాను లే కాక మొగల్ చక్రవర్తి అయిన ఔరంగజేబుకు సైతం శివాజీ అంటే భయం పుట్టింది. శివాజీ నుండి ఎప్పటికైనా తనకు ముప్పు వస్తుందని ఔరంగజేబు భావించి, తన మేనమామ అయిన షాయైస ఖాన్ ను శివాజీ పై యుద్ధానికి పంపాడు.

రెండుసార్లు పరాజయాన్ని ఎదుర్కొన్న ఆదిల్షా మూడోసారి సిద్ది జోహార్ అనే పేరు పొందిన సైన్యాధ్యక్షుడు కి అపారమైన సైనిక, ఆయుధ బలగాలు అందించి కొల్హాపూర్ పంపించాడు. ఆ సమయంలో కొల్హాపూర్ దగ్గరలో ఉన్న పన్ హాలా కోటలో శివాజీ కొన్ని వందల మంది అనుచరులతో ఉన్నాడు. ఆ విషయం తెలుసుకున్న శివాజీ ఎలాగైనా పన్ హాలా కోట నుండి తప్పించుకొని తన సైన్యం మొత్తం ఉన్న విశాల్ ఘడ్ కోటకు చేరుకుంటే యుద్ధం చేయవచ్చని అనుకున్నాడు. కానీ అప్పటికే పన్ హాలా కోట చుట్టూ శత్రు సైన్యం ఉండడంతో తాను యుద్ధానికి సిద్ధంగా లేనని దయతలచివలసిందిగా సిద్ది జోహార్ కు వర్తమానం పంపాడు. అది తెలుసుకున్న సిద్ధి జోహార్ సైనికులు నిఘా సరళం చేసి విశ్రాంతి తీసుకుంటుంటే శివాజీ తన అనుచరులతో కోట నుండి తప్పించుకొని తన సైన్యం ఉన్న కోట వైపు పయనం సాగాడు. ఇది తెలుసుకున్న సిద్ది జోహార్ తన బలగాలతో శివాజీని వెంబడించాడు. తోటకు చేరుకునే లోపు శత్రువులు తమను సమీపించ గలరు అని విషయం గ్రహించి బాజీ ప్రభు దేశ్ పాండే అనే సర్దార్ 300 మంది అనుచరులతో కలిసి శత్రు సైన్యాన్ని ఎదుర్కొంటామని, శివాజీని తన అంగరక్షకులతో ఎలాగైనా కోట చేరుకోని చెప్పి ఒప్పించాడు. శివాజీ కోట వైపు వెళ్లిన వెంటనే బాజీ ప్రభు దేశ్ పాండే రెండు చేతుల ఖడ్గాలు పట్టుకొని శత్రువులతో యుద్ధం చేశాడు.

300 మంది సైనికులు తమ ప్రాణాలకు తెగించి అతి బలమైన శత్రువులతో పోరాడి నేలకొరిగారు. అప్పటికి శివాజీ తన కోటకు చేరుకున్నాడు. తోటలో తన అనుచరులతో చర్చించిన అనంతరం తాము సిద్ది జోహార్ సైన్యాన్ని ఎదిరించ లేమని గ్రహించిన శివాజీ సంధికి అంగీకరించాడు. సంధిలో భాగంగా శివాజీ సామ్రాజ్యం స్వాతంత్రం రాజ్యంగా గుర్తింపు పొందింది. సిద్ది జోహార్ విజయానికి బహుమతిగా పన్ హాలా కోట లభించింది. ఈ యుద్ధమే సుల్తానులతో శివాజీ చేసిన ఆఖరి యుద్ధం.

మొగల్ సైన్యంతో యుద్ధాలు Chhatrapati Shivaji Battles with the Mughal Army

1660వ సంవత్సరంలో ఔరంగజేబు తన మేనమామ అయిన షాయిస్తా ఖాన్కు లక్షకు పైగా సైన్యాన్ని, ఆయుధాలను అందించి శివాజీని ఓడించి, దక్కన్ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకొని రమ్మని పంపించాడు. బలమైన షాయిస్తాఖాన్ సేన ముందు శివాజీ సేన తలవంచక తప్పలేదు. శివాజీ ఓటమిని అంగీకరించి పూణే వదిలి వెళ్ళవలసి వచ్చింది. పూణేలో శివాజీ నిర్మించిన మహల్ లో షాయిస్తాఖాన్ నివాసం ఏర్పరుచుకున్నాడు. ఎప్పటికైనా శివాజీ దాడి చేస్తాడని షాయిస్తా ఖాన్ పూణే నగరమంతా చాలా కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశాడు.

1663 వ సంవత్సరం ఏప్రిల్ నెలలో పూణే నగరంలో ఒక పెళ్లి ఊరేగింపు జరుగుతుండగా శివాజీ మారువేషంలో తన అనుచరులతో కలిసి పెళ్లికూతురు తరఫున బంధువుల్లో కలిసిపోయి లాల్ మహల్ చేరుకున్నాడు. ఆ భవనం స్వయానా తన పర్యవేక్షణలో నిర్మించబడింది కాబట్టి సులువుగా లోపలికి చేరుకొని షాయిస్తాఖాన్ గదిలోకి చేరుకున్నాడు. శివాజీ కత్తి వేటుకు షాయిస్తా ఖాన్ 3 వేళ్ళు తెగి కింద పడగా.. షాయిస్తాఖాన్ కిటికీలో నుండి దుమికి ప్రాణాలు రక్షించుకున్నాడు.

1664 వ సంవత్సరం నాటికి సూరత్ నగరం ప్రధాన వ్యాపార కేంద్రంగా ఉండేది. శివాజీ సూరత్ పైన దాడి చేసి ధనాన్ని, ఆయుధాలను దోచుకున్నాడు. అపారమైన ఆ మొఘల్ సంపదతో కొన్ని వేలమందిని తన సైన్యంలో చేర్చుకున్నాడు. కొద్ది రోజుల్లో మొఘలుల, బీజాపూర్ సుల్తానుల కోటలను ఒక్కొక్కటిగా తన సొంతం చేసుకోవడం మొదలుపెట్టాడు. ఇది తెలుసుకున్న ఔరంగజేబు తన దగ్గర పనిచేస్తున్న రాజపుత్రుడు అయిన రాజా జై సింగ్ ను శివాజీ పైకి పంపించాడు. రాజా జయసింగ్ గొప్ప రాజా నీతి గలవాడు. రాజా జైసింగ్ ఆధ్వర్యంలో మొఘల్ సేనలు మొదట పురంధర్ దుర్గాన్ని ఆక్రమించాయి. రాయఘర్ అక్రమానికై సేనలు ముందుగా సాగుతుండగా ఓటమి గ్రహించిన శివాజీ రాజా జయసింగ్ తో సంధికి దిగాడు.

1665 వ సంవత్సరంలో శివాజీ, రాజా జై సింగ్ తో పురంధర్ వద్ద సంధి చేసుకున్నాడు. ఆ తర్వాత కూడా శివాజీ ఒక మొఘల్ సర్దార్ గా ఉండడానికి అంగీకరించాడు. మొఘల్ సైన్యాన్ని ఉపయోగించుకొని తన శత్రువులైన బీజాపూర్, గోల్కొండ సుల్తానులను ఓడించడానికె శివాజీ మొఘల్ సర్దార్ గా ఉండడానికి ఒప్పుకున్నాడు.

1666 వ సంవత్సరంలో ఔరంగజేబు తన 50వ పుట్టినరోజు సందర్భంగా శివాజీనీ అతని ఆరేళ్ల కొడుకు శంభాజీని ఆగ్రాకు ఆహ్వానించాడు. ఆ సభలో శివాజీని సైనిక అధికారుల వెనక నిలబెట్టి అవమాన పరిచాడు. ఇది సహించలేని శివాజీ బయటికి వెళుతుండగా సైనికులు చుట్టుముట్టి శివాజీ ఉంటున్న అతిథి గృహానికి తీసుకువెళ్లి అక్కడే బందీ చేశారు. తన కొడుకుతో బందీగా ఉన్న శివాజీ ఎలాగైనా తప్పించుకోవాలని ప్రయత్నించసాగాడు. ప్రతిరోజు తాను ఏరి కోరి సమకూర్చిన పండ్లను ఆగ్రాలోని సాధువులకు, గుడులకు, ఫకీర్ లకు పంపించేలా అనుమతి తీసుకున్నాడు. కొన్ని నెలల పాటు పండ్ల బుట్టలు పంపించిన తర్వాత తాను పని మనిషిగా మారువేషం వేసుకొని కొడుకును బుట్టలో పెట్టుకుని తప్పించుకున్నాడు.

మువ్వాజం అనే దక్కన్ రాష్ట్ర పాలకుడి సలహా మేరకు ఔరంగజేబు శివాజీని రాజుగా గుర్తించాడు. మొఘల్ సైన్యాధిపతులు మహాబత్ ఖాన్, బహుదూర్ ఖాన్ మరియు దిలెవార్ ఖాన్ లు మూకుమ్మడిగా శివాజీ పై దాడి చేశారులు. శివాజీ తో యుద్ధంలో వారు ఘోర పరాజయం పొందారు. శివాజీ జీవిత చరిత్రలోనే ముఖ్యమైన విజయం గా ఇది పేర్కొనవచ్చు.

1670 వ సంవత్సరం జనవరి నుండి మొగల్ కోటల పైన దాడులు చేసి సొంతం చేసుకోవడం మొదలు పెట్టాడు. 1674వ సంవత్సరం నాటికి లక్షమంది సుశిక్షితులైన సైన్యాన్ని, ఆయుధాలను, అశ్వాలను, నౌక వ్యవస్థను సమకూర్చుకున్నాడు. అలుపెరగని యుద్ధాలతో అలసిపోవడం సరి అయిన సైన్యం లేకపోవడం ఖజానా ఖాళీ కావడంతో మొఘలైన్యం శివాజీని ఎదుర్కొనలేక పోయింది. శివాజీ ఎన్నో కోటలను సులువుగా స్వాధీనం చేసుకున్నాడు.

1674వ సంవత్సరం జూన్ 6న రాయఘడ్ కోటలో శివాజీని క్షత్రియ రాజులందరికీ అధిపతిగా కీర్తిస్తూ “చత్రపతి” అని బిరుదును ప్రదానం చేశారు. కొన్నాళ్లకు 50వేల మంది బలగంతో దక్షిణ రాష్ట్రాల దండయాత్రలు చేసి వెల్లూరు, గంగి లను సొంతం చేసుకున్నాడు.

Chhatrapati Shivaji Death మరణం

27 ఏళ్ల పాటు యుద్ధాలతో గడిపి హిందూ రాజులకు ఆదర్శంగా నిలిచిన సువిశాల మరాఠా సామ్రాజ్యాన్ని నెలకొల్పిన చత్రపతి శివాజీ మూడు వారాలు తీవ్ర జ్వరంతో బాధపడి ఏప్రిల్ 3 -1680 వ సంవత్సరమున మధ్యాహ్నం 12 గంటలకు రాయఘడ్ కోటలో మరణించాడు.

శివాజీ పెద్ద కొడుకు అయినా శంభాజీ తర్వాత రాజ్యాన్ని చేపట్టి మొఘలు లను సమర్ధవంతంగా ఎదుర్కొని పరిపాలించాడు.

Read also..

Jawaharlal Nehru biography in Telugu

CLICK HERE

Sharing is caring!

error: Content is protected !!