BEd Special Education Doubts and answers

BEd Special Education Doubts and answers

BEd Special Education: ప్రశ్నలు సమాధానాలు..

ప్రశ్న: BEd Special Education చదివిన వారికి ప్రమోషన్ ఉంటాయా ? (BEd Special Education Doubts and answers)

సమాధానం: BEd Special Education చదివిన వారికి SA (Special Education) గా ప్రమోషన్ పొందవచ్చు.

ప్రశ్న: అసలు ఏమిటి SA (Special Education)..?

సమాధానం: ఉమ్మడి రాష్ట్రంలో GO.MS.No.341, Date:21-12-2012 ద్వారా 1476 School Assistant (Special Education) పోస్టులు IEDSS (inclusive education for disabled at secondary stage) కొరకు Central sponsored scheme ద్వారా మంజూరు చేయబడినవి. తెలుగు రాష్ట్రాల విభజన తరువాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 860 తెలంగాణ రాష్ట్రానికి 616 పోస్టులు కేటాయించడం జరిగినది. AP లో 2019లో అప్పటికి BEd., Spl. Education చేసిన ఉపాధ్యాయులు (SGT లు) ఎక్కువ మంది లేనందున direct recruitment (Spl DSC) ద్వారా 70%, పదోన్నతుల ద్వారా 30% పోస్టులు భర్తీ చేయడం జరిగింది. APలో మిగిలిపోయిన పోస్టులకు 2021లో Spl DSC ప్రకటించినప్పటికీ కొన్ని కోర్టు కేసులు వల్ల ఆ DSC ఆగిపోయినది. APలో మిగిలిపోయిన (పదోన్నతుల) పోస్టులను April 2023లో మరియు February 2024 లో కొన్ని భర్తీ చేయడం జరిగినది. అయితే తెలంగాణలో SA Spl Education కు సంబంధించి Spl DSC  ఎక్సామ్ జరిగి ఫలితాల కొరకు ఎదురు చూస్తున్నారు.

ప్రశ్న: తెలుగు రాష్ట్రాల్లో Distance mode లో Spl BEd చేయడానికి ఏ యూనివర్సిటీ / కాలేజీ లు అందుబాటులో ఉన్నది..? 

సమాధానం: మన తెలుగు రాష్ట్రాల్లో Distance mode లో Dr.B.R.Ambedkar Open University నందు మాత్రమే ఈ కోర్స్ అందుబాటులో ఉన్నది.

ప్రశ్న: Distance mode కాకుండా Regular mode లో Spl BEd చేయడానికి అవకాశం ఉన్నదా..?

సమాధానం: అవును ఉన్నది.. ఉదాహరణ కు Andhra University వంటి యూనివర్సిటీ లలో ఈ కోర్స్ అందుబాటులో ఉన్నది.

ప్రశ్న: Spl BEd Entrance exam notification ఎప్పుడు విడుదల అవుతుంది..?

సమాధానం: మామూలుగా అయితే ప్రతి సంవత్సరం మార్చి-మే నెల లలో నోటిఫికేషన్ విడుదల అవుతుంది. అయితే 2019 వరకు కరెక్ట్ గా విడుదలైన నోటిఫికేషన్ కరోనా తర్వాత కొంత ఆలస్యం అవుతున్నది.

ప్రశ్న: అయితే ఇప్పుడు ఏ నోటిఫికేషన్ అందుబాటులో ఉంది లేదా ఉండనున్నది..?

సమాధానం: BRAOU 2023 సం. నోటిఫికేషన్ విడుదల కావాల్సి ఉన్నది. 2022 సం. నోటిఫికేషన్ కు సంబంధించి ప్రస్తుతం తరగతులు జరుగుచున్నవి.

సామాజిక మాధ్యమాల ద్వారా తెలిసిన సమాచారం ప్రకారం Dr.B.R.Ambedkar Open University నందు ఇక 2 సం.6 నెలల కోర్సుకు సంభందించి నోటిఫికేషన్ లు విడుదలకు అవకాశం లేదు. NEP 2020 ప్రకారం సంస్కరణలలో భాగంగా RCI జారీ చేసిన circular ప్రకారం 4 సం.ల ఇంటిగ్రేటెడ్ కోర్సులను అమలు చేసే క్రమంలో వీటిని నిలుపుదల చేయవచ్చని తెలుస్తున్నది. (అధికారిక ఉత్తర్వులు విడుదల కావలసి ఉన్నది) పూర్తి సమాచారం కొరకు క్రింది పోస్ట్ ను చదవండి..

Duration of BEd (Special Education) is 4 years

CLICK HERE

ప్రశ్న: సాధారణ BEd కి spl BEd కి మధ్య వ్యత్యాసం ఏమిటి..?

సమాధానం: సాధారణ BEd కి రెండు మెథడాలజీలు ఉన్నట్లే spl BEd కూడా రెండు మెథడాలజీలు ఉంటాయి. అయితే spl BEd లో రెండు మెథడాలజీలలో ఒకటి జనరల్ టీచింగ్ లెసన్ ప్లాన్ మరియు స్పెషల్ టీచింగ్ లెసన్ ప్లాను రాయాల్సి ఉంటుంది. TP లు, Records కూడా ఇలానే ఉంటాయి.

ప్రశ్న: spl BEd చదివారు సాధారణ DSC రాయవచ్చా..?

సమాధానం: spl BEd చదివిన వారు సాధారణ DSC తో పాటు spl DSC రెండు రాయవచ్చు. ఒక రకంగా చెప్పాలంటే రెండు విధాలుగా ఇది పనికి వస్తుంది.

ప్రశ్న: BEd చదువ గోరు అభ్యర్థులు spl BEd చదివితే మంచిదా..?

సమాధానం: Spl BEd వలన BEd చదివిన వారికి ఉండే ప్రయోజనాలతో పాటు కొన్ని పాఠశాలలో spl BEd వారికి ప్రాధాన్యత ఇస్తారు..

అయితే ఇక్కడ ఒక విషయం ఏమిటంటే spl BEd చేసిన వారు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి RCI సర్టిఫికెట్ ను రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ సర్టిఫికెట్ కోసం CRE ప్రోగ్రామ్స్ (online & offline) కు హాజరు కావలసి  ఉంటుంది.

ప్రశ్న: spl BEd వారికి విదేశాల అవకాశాలు ఉంటాయా..?

సమాధానం: spl BEd చదివిన వారికి విదేశాల్లో చక్కని అవకాశాలు ఉన్నాయి. కొన్ని దేశాల్లో ఒక CWSN విద్యార్థికి ఒక టీచర్ ను కేటాయిస్తున్నారు. వారు విద్యార్థి ఇంటికి వెళ్లి బోధించవలసి ఉంటుంది.

ప్రశ్న: spl BEd చదివిన వారికి విదేశాల్లో శాలరీ ఎలా ఉంటుంది..?

సమాధానం: విదేశాల్లో spl BEd చదివిన వారికి software Engineer శాలరీ కి అటు ఇటుగా శాలరీ ఉంటుంది.

ప్రశ్న: మన తెలుగు రాష్ట్రాల్లో చదివిన spl BEd అభ్యర్థి వేరే రాష్ట్రాల్లో లేదా వేరే దేశాల్లో పని చేయాలంటే ఏవైనా ఇబ్బందులు ఉంటాయా..?

సమాధానం: కొన్ని కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాలి ఉండవచ్చు. ఉదాహరణకు (Hearing Impairment) HI విద్యార్థికి బోధించేటప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో ప్రాంతాన్ని బట్టి sign లు వాడుతూ బోధిస్తాము. ఈ sign లు రాష్ట్రాన్ని బట్టి దేశాన్ని బట్టి మారవచ్చు.

Read also..

BEd Special Education course full details

CLICK HERE

Sharing is caring!

error: Content is protected !!