AP TS Govt Employees Earned Leaves (EL’s) in Summer – details
వేసవిలో సంపాదిత సెలవులు – వివరాలు
సంపాదిత సెలవు (Earned Leave) : APLR – 8 & 17
- ఉద్యోగి తన సర్వీసు కాలంలో ఆర్జించే సెలవును సంపాదిత సెలవు (E.L.) అంటారు. (Govt Employees Earned Leaves in Summer)
- ఉద్యోగి డ్యూటీ కాలమును బట్టి సంపాదిత సెలవు జమచేయబడుతుంది.
- నాన్ వెకేషన్ డిపార్ట్మెంట్లోని పర్మనెంట్ ఉద్యోగికి తన డ్యూటీ కాలంలో 11వ వంతు సంపాదిత సెలవు లభిస్తుంది.
- సంవత్సరానికి 30 రోజుల చొప్పున జమచేయబడుతుంది.
- గరిష్టంగా 300 రోజులు మాత్రమే నిల్వ వుంచుకోవచ్చు (G.O.Ms.No.232, Fin.dt.16-9-05)
- టెంపరరీ ఉద్యోగికి డ్యూటీ కాలంలో 22వ వంతు మాత్రమే సంపాదిత సెలవు జమచేయబడుతుంది.
- గరిష్టంగా 30 రోజులు మాత్రమే నిల్వవుంచుకోవీలౌతుంది.
వెకేషన్ డిపార్ట్మెంట్ :
- 15 రోజులకు మించిన విరామంకల ఉద్యోగులను ఎఫ్.ఆర్.(89) ప్రకారం వెకేషన్ డిపార్ట్ మెంట్ గా పరిగణిస్తారు.
- ఉపాధ్యాయులు, పాఠశాలల సిబ్బంది వెకేషన్ డిపార్ట్మెంట్ పరిగణింపబడుతారు.
- ఉపాధ్యాయులకు (వెకేషన్ డిపార్ట్ మెంట్ వారికి) తేది.31-10-89 వరకు సంవత్సరానికి 3 రోజులు, తేది.01-11-89 నుండి తేది.15-9-94 వరకు సంవత్సరానికి 5 రోజులు , 15-9-94 (1-1-95) నుండి సంవత్సరానికి 6 రోజులు జమచేయబడుతున్నాయి.
- ప్రస్తుతం EL ను ప్రతి సంవత్సరం జనవరి 1న, జూలై 1న 3 రోజులు చొప్పున అడ్వాన్సుగా జమచేస్తారు. Go.Ms.No. 317, Edn. Dt. 15-9-1994
- సంపాదిత సెలవు లెక్కింపుకు సూత్రం:- డ్యూటీ కాలము × 1/11 – 27 = డి.పి.×0.0169.
- తాత్కాలిక ఉపాధ్యాయులకు (రెగ్యులరైజేషన్ కాని వారికి) జనవరి1న, జూలై 1న 2 రోజుల చొప్పున జమచేస్తారు.
- వేసవి సెలవులలో పనిచేసిన కాలానికి F.R.82(b) మరియు G.O.Ms.No.35, dt.16-1-1981 జి.ఓ. ఎంఎస్.నం. 151, తేది. 14.11.2000 మరియు జి.ఓ.ఎంఎస్.నం. 114, తేది. 28.04.2005ల ప్రకారం దామాషా సంపాదిత సెలవు ప్రిజర్వ్ చేయబడుతుంది.
- వేసవిలో పనిచేసిన కాలానికి దామాషా సంపాదిత సెలవు లెక్కింపు సూత్రము:- [(డ్యూటీ కాలము × 1/11) – (27 × వాడుకొన్నవేసవి సెలవులు/మొత్తం వేసవి సెలవులు) ]-6
- వాడుకున్న వేసవి సెలవులు 15 రోజులకంటే తక్కువ ఉంటే మొత్తం వేసవి సెలవులు వినియోగించుకోలేదన్నట్లుగా భావించి 24 రోజుల సంపాదిత సెలవు జమ చేయబడుతుంది.
- సంపాదిత సెలవును ఒకేసారి 180 రోజులకు మించి వాడుకోకూడదు. (GO.153 Fin, dt.04.05.2010.)
- సంపాదిత సెలవును అర్ధజీతపు సెలవు, వేసవి సెలవులతో కలిపి ఒకే సారి 180 రోజులకు మించి వాడుకోకూడదు.
- తాత్కాలిక ఉద్యోగి ఒకే సారి 30 రోజులకు మించి వాడుకోకూడదు.
Recost of E.L.:
- ఉద్యోగి సర్వీసు రెగ్యులరైజేషన్ వెనుకటి తేదీ నుండి జరిగినప్పుడు ఆ తేదీ నుండి సంపాదిత సెలవు తిరిగి లెక్కించి వ్యత్యాసాన్ని జమచేస్తారు.
- ఈ సెలవును రెగ్యులరైజేషన్ ఉత్తర్వులు వెలువడిన తేదీ తర్వాత మాత్రమే వినియోగించుకోవాల్సి ఉంటుంది. (G.O.Ms.No.250, ఆర్థికశాఖ, తేది. 13-12-1967).
పనిచేసిన రోజులకి సంపాదిత సెలవులు టేబుల్
పనిచేసిన రోజులు | సంపాదిత సెలవులు | పనిచేసిన రోజులు | సంపాదిత సెలవులు |
1,2 | 1 | 25 | 14 |
3,4 | 2 | 26,27 | 15 |
5,6 | 3 | 28,29 | 16 |
7 | 4 | 30,31 | 17 |
8,9 | 5 | 32,33 | 18 |
10,11 | 6 | 34,35 | 19 |
12,13 | 7 | 36 | 20 |
14,15 | 8 | 37,38 | 21 |
16 | 9 | 39,40 | 22 |
17,18 | 10 | 41,42 | 23 |
19,20 | 11 | 43,44,45 | 24 |
21,22 | 12 | 46,47,48,49 | 24 |
23,24 | 13 |
Read also..