AP POLYCET-2023 Results and Rank cards
ఏపి పాలిసెట్-2023 ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాలను విజయవాడలో శనివారం ఉదయం 10.45గంటలకు మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 84 ప్రభుత్వ, 175 ప్రైవేటు పాలిటెక్నిక్ కాలేజీలలో 29 విభాగాల్లో 70వేల 569 సీట్లు అందుబాటులో ఉన్న విషయం తెలిసిందే.
ఏపీలో ఈ నెల 10వ తేదీన నిర్వహించిన పాలిటెక్నిక్ ఉమ్మడి ప్రవేశ పరీక్ష (పాలిసెట్-2023) పరీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 1,43,625 మంది అభ్యర్థులు హాజరయ్యారు. అయితే.. ఈ ప్రవేశ పరీక్ష ఫలితాల విడుదల తేదీని రాష్ట్ర సాంకేతిక విద్యా శాఖ కమిషనర్, రాష్ట్ర సాంకేతిక విద్య, శిక్షణా మండలి చైర్మన్ చదలవాడ నాగరాణి ప్రకటించారు. ఇదే రోజున ప్రవేశాలకు సంబంధించిన వెబ్ కౌన్సిలింగ్ షెడ్యూల్ ను సైతం ప్రకటించనున్నారు. పాలిసెట్-2023 ఫలితాలను, ర్యాంకుల వివరాలను https://polycetap.nic.in వెబ్ సైట్ ద్వారా చెక్ చేసుకోవచ్చు.
ఫలితాలను చెక్ చేసుకునే విధానం..
- ముందుగా క్రింద ఇచ్చిన ఏదైన ఫలితాల లింకు ని క్లిక్ చేయండి.
- మీ పాలిసెట్-2023 హాల్ టిక్కెట్ నెంబర్ ను ఎంటర్ చేసి submit బటన్ పై క్లిక్ చేయండి.
- మీ పాలిసెట్-2023 ర్యాంక్, మార్క్ లు డిస్ప్లే అవుతాయి .
- భవిష్యత్ అవసరాలకు ర్యాంక్ కార్డ్ ను ప్రింట్ తీసుకొనగలరు.
పరీక్ష రాసిన అభ్యర్థులు క్రింద ఇచ్చిన లింకు ద్వారా ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.
AP POLYCET-2023 Results (Official website)
AP POLYCET-2023 Results (Sakshi website)
AP POLYCET-2023 Results (Eenadu website)