AP Model Schools Inter Admissions-2023 Notification

AP Model Schools Inter Admissions-2023 Notification

ఆదర్శ పాఠశాలల్లో ఇంటర్ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 162 ఆదర్శ పాఠశాలల్లో 2023-24 విద్యా సంవత్సరానికి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్. సురేష్ కుమార్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు ఇంటర్మీడియెట్ మొదటి సంవత్సరంలో ప్రవేశం పొందేందుకు ఆన్లైన్ ద్వారా MPC/Bi.PC/ MEC / CEC గ్రూపుల్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఆదర్శ పాఠశాలల్లో ఆంగ్లమాధ్యమంలో బోధన ఉంటుంది. కోర్సునకై  విద్యార్థులు ఎటువంటి ఫీజులు చెల్లించాల్సిన అవసరం లేదు. (AP Model Schools Inter Admissions-2023 Notification)

ప్రభుత్వ లేక ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు మాత్రమే అర్హులు. ఈనెల 22 నుంచి జూన్ 7వ తేదీలోపు పేమెంట్ గేట్ వే ద్వారా పరీక్ష రుసుము చెల్లించిన తరువాత వారికి జనరల్ నెంబర్ కేటాయిస్తారు, ఆ జనరల్ నంబర్ ఆధారంగా https://cse.ap.gov.in లేదా https://apms.apcfss.in వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలి.

AP Model Schools Inter Admissions-2023 ప్రవేశ అర్హతలు:

సంబంధిత జిల్లాల్లో ప్రభుత్వ లేక ప్రభత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో 10 వ తరగతి లో ఉత్తీర్ణులైన విద్యార్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేయడానికి ముందుగా వివరాలతో కూడిన సమాచారము కొరకు https://apms.apcfss.in or https://cse.ap.gov.in చూడగలరు.

Model Schools Inter Admissions-2023 దరఖాస్తు చేయు విధానము:

అభ్యర్థులు పైన తెలుపబడిన అర్హత పరిశీలించి సంతృప్తి చెందిన తర్వాత తేదీ. 22.05.2023 నుండి 07.06.2023 వరకు net banking / credit / debit card లను ఉపయోగించి gate way ద్వారా అప్లికేషన్‌ రుసుము చెలించిన తరువాత వారికి ఒక జనరల్‌ నెంబరు కేటాయించబడును. ఆ జనరల్‌ నెంబరు ఆధారంగా వెబ్‌ సైట్‌ https://apms.apcfss.in or https://cse.ap.gov.in లో దరఖాస్తు చేసుకొనవలయును.

Model Schools Inter Admissions-2023 దరఖాస్తు చేయడానికి రుసుము:

OC, BC మరియు EWS లకు రూ. 200/- (అక్షరములా రెండు వందల రూపాయలు మాత్రమే) SC మరియు ST లకు రూ.150/- (అక్షరములా నూట యాబై రూపాయలు మాత్రమే).

ప్రవేశములు 10 వ తరగతి మార్కుల మెరిట్‌ ద్వారా రిజర్వేషన్‌ రూల్స్‌ ప్రకారం ఇవ్వబడును. ఇతర వివరములకు ఆదర్శ పాఠశాల ప్రిన్సిపాల్‌ ను గాని లేక సంబంధిత జిల్లా విద్యాశాఖాధికారిని / మండల విద్యాశాఖాధికారిని సంప్రదించగలరు.

Detailed… Notification

DOWNLOAD

For Model schools Admissions Official website

CLICK HERE

Read also..

AP Model Schools 6th Class Admissions-2023 Notification

CLICK HERE

Sharing is caring!

error: Content is protected !!