AP Academic Calendars 2024-25
-
ఏపి అధికారిక పాఠశాల విద్య అకడమిక్ కేలండర్స్ 2024-25 విడుదల.
-
రాజకీయాలకు అతీతంగా పాఠశాల విద్య అకడమిక్ క్యాలెండర్
రాష్ట్రంలో పాఠశాల విద్యాశాఖకు సంబంధించిన 2024-25 అకడమిక్ క్యాలెండర్ ను రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ సోమవారం విడుదల చేశారు. గతానికి భిన్నంగా ఈ సారి ముఖ్యమంత్రి, మంత్రి ఫోటోలు లేకుండా రాజకీయాలకు అతీతంగా స్కూల్ అకడమిక్ క్యాలెండర్ ను రూపొందించారు. (AP Academic Calendars 2024-25)
స్కూల్ మేనేజ్ మెంట్ కమిటీల పదవీకాలం జులైతో పూర్తయినందున ఆగస్టులో మేనేజ్ మెంట్ కమిటీల ఎన్నికలు పూర్తిచేయాలని మంత్రి ఆదేశించారు. పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం నాణ్యత, మౌలిక సదుపాయాల మెరుగుదల పర్యవేక్షణ బాధ్యతను పేరెంట్స్ కమిటీలకు అప్పగించాలని సూచించారు. ప్రభుత్వ స్కూళ్లలో టాయ్ లెట్స్ నిర్వహణ మెరుగుపర్చాలని, ఇందుకు అవసరమైన కెమికల్స్, ఉపకరణాల కొనుగోలుకు తక్షణమే టెండర్లు పిలవాలని ఆదేశించారు. సిబిఎస్ఇ స్కూళ్ల పనితీరుపై సుదీర్ఘంగా చర్చించిన మంత్రి లోకేష్ త్వరలో తదుపరి రూట్ మ్యాప్ ప్రకటిస్తామని చెప్పారు. కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయాల్లో ఖాళీగా ఉన్న టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన మంత్రి లోకేష్, విధివిధానాలు ఖరారు చేయాల్సిందిగా సూచించారు. సమావేశంలో స్కూల్ ఎడ్యుకేషన్ కార్యదర్శి కోన శశిధర్, డైరక్టర్ విజయరామరాజు, రాష్ట్ర సమగ్ర శిక్ష ప్రాజెక్ట్ డైరక్టర్ బి.శ్రీనివాసరావు పాల్గొన్నారు.
అన్ని సబ్జెక్టులకు సంభందించిన నెలవారీ సిలబస్, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయుల విధులు, స్కూల్ కాంప్లెక్స్ షెడ్యూల్, లాంగ్వేజ్ మేళా, క్లబ్, ల్యాబ్స్, తెలుగు భాషా వారోత్సవాలు, కల్చరల్ యాక్టివిటీస్‌తో సహా స్కూళ్లలో చేపట్టాల్సిన పలు అంశాలతో అకడమిక్ కేలెండర్‌లో పొందుపరిచారు.
Assessments dates:
- FA-1/CBA 1: Aug 27-31
- FA-2: Oct 21-25
- SA-1: Nov 25-04 Dec
- FA-3/CBA 2: Jan 27-31
- FA-4: Mar 03-07
- SA – II : April: 07-17
Holidays details:
- Dasara: 04-10-2024 to 13-10-2024
- Christmas: 22-12-2024 to 29-12-2024 for Missionary Schools
- Pongal: 10-01-2025 to 19-01-2025
AP Primary, UP & High Schools Academic Calendars 2024-25
TITLE | LINK |
Primary schools calendar | DOWNLOAD |
High schools calendar | DOWNLOAD |
Read also..