Dr. B.R.Ambedkar Biography in Telugu

Dr. B.R.Ambedkar Biography in Telugu

డా.బి.ఆర్. అంబేద్కర్ (ఏప్రిల్ 14, 1891 – డిసెంబర్ 6, 1956)

భీంరావ్ రాంజీ అంబేద్కర్ (డా. బాబాసాహెబ్ అంబేద్కర్ గా సుపరిచితుడు) (1891 ఏప్రిల్ 14 – 1956 డిసెంబరు 6) ప్రముఖ భారతీయ న్యాయవాది, ఆర్థిక శాస్త్రవేత్త, రాజకీయ నేత, సంఘ సంస్కర్త. భారత రాజ్యాంగ పితామహుడు. భారత రాజ్యాంగ రూపకల్పనలో ప్రధాన పాత్రను పోషించిన వారు డా. బి.ఆర్ అంబేద్కర్ గారు. అంబేద్కర్ అంటరానితనం, కుల నిర్మూలన కోసం ఎంతో కృషి చేశాడు. అంబేద్కర్ స్వతంత్ర భారతదేశపు మొట్టమొదటి కేంద్ర న్యాయశాఖ మంత్రి. ఇతను కొలంబియా విశ్వవిద్యాలయం నుండి పి.హెచ్.డి., లండన్ విశ్వవిద్యాలయం నుండి డి.ఎస్.సి (డాక్టరేట్) పట్టాలను పొంది చాలా అరుదైన గౌరవాన్ని సంపాదించాడు. న్యాయ, సామాజిక, ఆర్థిక శాస్త్రాలలో పరిశోధనలు చేశాడు. మొదట్లో న్యాయవాదిగా, అధ్యాపకుడిగా, ఆర్థికవేత్తగా పనిచేశాడు. తరువాత భారతదేశ స్వాతంత్ర్యం, పత్రికల ప్రచురణ, దళితుల సామాజిక రాజకీయ హక్కులు, భారతదేశ రాజ్యాంగ వ్యవస్థాపన కోసం కృషి చేశాడు. (Dr. B.R.Ambedkar Biography in Telugu)

Dr. B.R.Ambedkar బాల్యం – విద్యాభ్యాసం

అంబేద్కర్ గారు కొంకణ ప్రాంతంలోని మహర్ కులానికి చెందిన భీమాభాయి, రాంజీ మాలోజి సక్పాల్ లకు పద్నాలుగో సంతానంగా.. 1891- ఏప్రిల్ 14న జన్మించారు. అతని కుటుంబం ఆధునిక మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లాలో ‘అంటవాడ’ గ్రామంలో నివసించేవారు. తల్లిదండ్రులు ఆయనకు పెట్టిన పేరు భీమారావు రాంజీ అంబేద్కర్, భీమారావుకు రెండేళ్ల వయసు ఉన్నప్పుడు తండ్రి ఉద్యోగం విరమించుకున్నాడు. కుటుంబ పోషణకు అతడు సతారాకు మారాడు.

ఆయనకు ఆరేళ్ల వయసు ఉన్నప్పుడు తల్లి చనిపోవడంతో తండ్రి పునర్వివాహం చేసుకున్నాడు. దుర్భర దారిద్య్ర్యంతో, హరిజనుడు అయినందువలన అస్ప్రుశ్యుడీగా భావింపబడి అవమానాలు పొందుతూ చిన్నతనంలోనే అంటరానితనాన్ని ఎదుర్కొంటూ జీవితం గడపసాగాడు. పాఠశాలలో అందరి పిల్లలతో కలవకుండా, మాట్లాడకుండా పాఠశాల గదిలో ఒక మూలన కూర్చోబెట్టే వారు. కృష్ణాజీ ఉపాధ్యాయుడికి అంబేద్కర్ అంటే చాలా ఇష్టం, గతంలో అంబేద్కర్ ఇంటి పేరు అంబావడేకర్ అయితే ఉపాధ్యాయుడు అంబేద్కర్ ని ఇష్టపడి అతని పేరును అంబావడేకర్ నుండి అంబేద్కర్ గా మార్చాడు. అప్పటి నుండి అతని పేరు బి.ఆర్ అంబేద్కర్ గా మార్చబడింది.

దళితుడైన అంబేద్కర్ కు చిన్నప్పటినుండే అనేక వేధింపులకు గురి అయ్యాడు. చిన్నతనంలో అన్నయ్యతో కలిసి వేరే ప్రాంతమునకు వెళ్ళుచుండగా దాహం వేసి పక్కనే ఉన్న ఇంటికి నీళ్లు తాగేందుకు వెళ్లారు. అతడు మహార్ కులానికి చెందిన వాడని తెలిసి, నీరు ఇవ్వడానికి నిరాకరించారు.

1907వ సంవత్సరంలో కూలి పని చేస్తూ డబ్బులు సంపాదించి మెట్రిక్యులేషన్ పరీక్షల్లో ఉత్తీర్ణుడైనాడు. రామా బాయ్ ని పెళ్లి చేసుకొని ముంబాయిలోని ఎలిఫిన్సెన్ కళాశాలలో చేరి ఎఫ్. ఏ. పూర్తి చేశారు. బరోడా మహారాజు శాయాజీరావ్ గైక్వాడ్ ఇచ్చిన 25 రూపాయల విద్యార్ధి వేతనంతో 1912వ సంవత్సరంలో బి.ఏ పరీక్షల్లో ఉత్తీర్ణుడయ్యాడు. పట్టభద్రుడైన వెంటనే బరోడా సంస్థానంలో ఉద్యోగం లభించింది. కానీ పై చదువులు చదవాలన్న పట్టుదల వల్ల ఉద్యోగంలో చేరలేదు. బరోడా మహారాజుకి తన కోరికను తెలుపగా 1913వ సంవత్సరంలో విదేశంలో చదువు పూర్తి చేసిన తర్వాత బరోడా సంస్థానంలో పదేళ్లు పనిచేసే షరతుపై, రాజా గారి ఆర్థిక సహాయం అందుకొని కొలంబియా విశ్వవిద్యాలయంలో చేరాడు.

1915 వ సంవత్సరంలో ఎం. ఏ, మరియు 1916వ సంవత్సరంలో బార్- అట్- లా, కొలంబియా విశ్వవిద్యాలయం నుండి పి.హెచ్. డి పట్టాలను, మరియు లండన్ విశ్వవిద్యాలయం నుండి డి. ఎస్. సి పట్టాలను పొందుకున్నారు. 1916 వ సంవత్సరంలో లండన్ వెళ్లి ఆర్థిక, రాజకీయ, న్యాయ శాస్త్రాలను చదివి బారిష్టర్ అయినాడు. 1917 వ సంవత్సరంలో అంబేద్కర్ గారు భారతదేశానికి తిరిగి వచ్చి, ఒప్పందం ప్రకారం బరోడా సంస్థానంలో రక్షణ శాఖలో ఉద్యోగం చేశారు.

డాక్టర్. అంబేద్కర్ గా స్వదేశం వచ్చినప్పుడు ఆయన వయసు 27 ఏళ్లు. భారతదేశానికి తిరిగి వచ్చి బొంబాయిలో న్యాయవాద వృత్తిని ప్రారంభించాడు. 1918 వ సంవత్సరంలో సిడన్ హోమ్ కళాశాలలో ప్రొఫెసర్ అయినాడు. ఒక దళితుడు అంత గొప్ప పేరు సంపాదించుకోవడం ఆనాటి అగ్రవర్ణాల వారికి ఆశ్చర్యం కలిగించింది. హరిజన కులంలో పుట్టినందునవలన ఎంత గొప్ప విద్యావంతుడైన సమాజ బహిష్కరణకు గురి కావలసి వచ్చింది.

భారత రాజ్యాంగం

1927 వ సంవత్సరం లో అంటరానితనానికి వ్యతిరేక ఉద్యమాలు చేయడం ప్రారంభించారు. మహద్ లో ప్రారంభించిన దళితుల మహాసభ కు దేశం నలుమూలల నుండి కొన్ని వేల మంది దళితులు తరలివచ్చారు. అప్పటివరకు దళితులు మహద్ లోని చెరువు నీటిని తాగడానికి అక్కడ ప్రజలూ అనుమతించేవారు కాదు. కానీ అంబేద్కర్ గారు ఆ సభలో దానికి వ్యతిరేకంగా పోరాడి ఆ చెరువు నీటిని తాగేలా అనుమతి వచ్చేలా చేశారు. అంబేద్కర్ గారు ధైర్యంగా వెళ్లి ఆ చెరువులో నీటిని తాగారు. ఆ ఒక్క సభతో అంబేద్కర్ గారి పేరు దేశమంతా మారు మ్రోగి పోయింది. దళితులకు పాఠశాలలు, దేవాలయాల్లో ప్రవేశం కల్పించడంలో ఉద్యమాలు ప్రారంభించి విజయం సాధించారు. స్వాతంత్రం తరువాత అంబేద్కర్ గారు సెంట్రల్ కౌన్సిల్ లో మొదటి న్యాయ మంత్రిగా నియమితులయ్యారు. అందరికీ విద్య అందుబాటులో ఉండేలా కృషి చేశారు.

ఒకనాడు కేంద్ర మంత్రి అయిన టి.టి కృష్ణమాచారి రాజ్యాంగ పరిషత్తులో మాట్లాడుతూ.. రాజ్యాంగ రచనా సంఘంలో నియమితులైన ఏడుగురిలో ఒకరు రాజీనామా చేశారు. మరియొకరు మరణించారు, వేరొకరు అమెరికాలో ఉండిపోయారు. ఇంకొకరు రాష్ట్ర రాజకీయాలలో నిమగ్నులయ్యారు. ఉన్న ఒకరిద్దరు ఢిల్లీ కి దూరంగా ఉన్నారు. అందువలన భారత రాజ్యాంగ రచన భారమంతా డాక్టర్. అంబేద్కర్ గారు చేయవలసి వచ్చింది. రాజ్యాంగం రచన అత్యంత ప్రామాణికంగా ఉంటుందనటంలో ఎలాంటి సందేహం లేదు అని అన్నాడు.

1951 వ సంవత్సరం అక్టోబర్ లో కేంద్ర మంత్రిమండలిలో న్యాయశాఖ మంత్రిగా ఉండి, ఆ మంత్రి పదవికి రాజీనామా చేశారు. రాజ్యాంగ పరిషత్తు సభ్యుడిగా విశేషమైన శ్రమను అనుభవించి, భారమంతా రాజ్యాంగం రచించుట లో ఆయన శేష జీవితంలో ముఖ్యమైన ఘట్టం. భారత రాజ్యాంగ డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ గా ఎంపికైన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగాన్ని రూపొందించే అవకాశం లభించింది. మన భారతదేశ రాజ్యాంగాన్ని ‘2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు” రాయడం జరిగింది. ఆయన ‘ద బుద్ధ అండ్ హిజ్ ధమ్మ’ అనే పుస్తకాన్ని కూడా రచించారు.

1920వ సంవత్సరం నాగపూర్ లో నిమ్నజాతుల సభను ఏర్పాటుచేసి, ప్రసంగించి ప్రశంసలు అందుకున్నారు. 1924 సంవత్సరంలో బహిష్కృత హితకారిణి సభను నెలకొల్పి నిమ్నజాతుల అభివృద్ధికి కృషి చేశారు. 1928వ సంవత్సరంలో సైమన్ కమిషనుకు నిమ్నజాతుల తరపున మహజరు సమర్పించాడు. 1929వ సంవత్సరంలో నిమ్నజాతుల సభకు అధ్యక్షుడైనాడు. 1930వ సంవత్సరంలో ఇంగ్లాండు వెళ్లి రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నారు. న్యాయ కళాశాలకు ప్రిన్సిపాల్ గా పనిచేసి బొంబాయిలో స్థిర నివాసం ఏర్పరుచుకున్నాడు, “కుల నిర్మూలన” అనే గ్రంధాన్ని రచించాడు. 1936వ సంవత్సరంలో ఇండిపెండెంట్ లేబర్ పార్టీని నెలకొల్పాడు. జీవితంలోని ముఖ్యమైన ఘట్టాలను తన ఆత్మకథ ‘వెయిటింగ్ ఫర్ ఏ వీసా’లో అంబేడ్కర్ రాసుకున్నారు.

స్వాతంత్రం వచ్చిన తర్వాత బి. ఆర్. అంబేద్కర్ గారు భారత ప్రభుత్వంలో న్యాయశాఖ మంత్రిగా పనిచేసి, భారత రాజ్యాంగ నిర్మాతలలో ప్రముఖుడిగా పేరుగాంచాడు. ఎన్నికలలో గెలిచి లోక్ సభకు సభ్యుడయ్యాడు. బౌద్ధ మతాన్ని స్వీకరించి ఔరంగాబాద్ లో కళాశాలను స్థాపించాడు. అనేక విశ్వవిద్యాలయాలు, సంస్థల గౌరవ పురస్కారాలను అందుకున్నారు. దళితులకు ఆశాజ్యోతిగా, ఎందరికో స్ఫూర్తిగా నిలిచాడు.

మరణం – గుర్తింపు

అంబేడ్కర్ మధుమేహం వ్యాధితో బాధపడుతూ 1954లో డిసెంబర్ 6న కన్నుమూశారు. 1990లో భారత ప్రభుత్వం అత్యున్నత పౌర పురస్కారం భారత రత్నను ఇతనికి మరణాంతరం ప్రకటించింది. ఇతను చేసిన విశేష కృషికి ఇతని పుట్టినరోజును “అంబేద్కర్ జయంతి”గా జరుపుకుంటారు. 2012లో ది హిస్టరీ ఛానల్, రిలయన్స్ మొబైల్  భాగస్వామ్యంతో అవుట్ లుక్ మ్యాగజైన్ నిర్వహించిన ది గ్రేటెస్ట్ ఇండియన్ పోల్ లో అతను మొదటి స్థానంలో ఎంపికైయ్యాడు. ఆయన వర్దంతిని “మహాపరినిర్వాన్ దివస్‌‌”గా కేంద్రం  ప్రకటించింది.

Read also…

Babu Jagjivan Ram Biography

CLICK HERE

Trending Information
error: Content is protected !!