28th February National science day

28th February National science day

జాతీయ సైన్స్ దినోత్సవం

భారతీయుల సైన్స్ సత్తాను ప్రపంచానికి చాటిన “భారతరత్న” డాక్టర్ సి.వి.రామన్ ఫిజిక్స్ రంగంలో ‘రామన్ ఎఫెక్ట్’ కనుగొన్న ఫిబ్రవరి 28ను “జాతీయ సైన్స్ దినోత్సవంగా” జరుపుకుంటున్నాము. ఆధునిక విజ్ఞానం, సాంకేతిక శాస్త్రాల్లో రామన్ ఫలితము అతి ప్రధానమైన ప్రయోగాత్మక సాధనం. అంతర్జాతీయ వైజ్ఞానిక సాంకేతిక శాస్త్రంలో కీలక పాత్రను వహిస్తున్న రామన్ ఫలితం.. భారతీయుడు కనుగొనడం భారత జాతికి గర్వకారణం. ‘రామన్ ఎఫెక్ట్’ ప్రపంచవ్యాప్తంగా భారతదేశానికి ఎనలేని గుర్తింపు తెచ్చిన ఆవిష్కరణ అది. 28th February National science day

జాతీయ సైన్స్ దినోత్సవ నేపద్యం

1986లో నేషనల్ కౌన్సిల్ ఫర్ సైన్స్ అండ్ టెక్నాలజీ కమ్యూనికేషన్ (NCSTC), ఫిబ్రవరి 28న జాతీయ దినోత్సవం గా ప్రకటించాలని భారత ప్రభుత్వాన్ని కోరింది. దానికి గుర్తుగా 1928 ఫిబ్రవరి 28న రామన్ ఎఫెక్ట్ కనుగొనడంతో ఆరోజున ‘జాతీయ సైన్స్ దినోత్సవంగా’ జరుపుకుంటాం.

రామన్ ఎఫెక్ట్ అనే అంశం పైన ‘నేచర్ పత్రికలో సి. వి. రామన్ ప్రచురించిన వ్యాసాలను చూచి ప్రపంచం ఆశ్చర్యపడింది. భారతదేశపు వైజ్ఞానిక రంగంలో ఏకైక నోబెల్ బహుమతి విజేత గా.. 1930 డిసెంబర్ లో సి.వి. రామన్ ను “నోబెల్ బహుమతి” వరించింది. 1954లో వీరికి “భారతరత్న”బహుకరించారు.

సైన్స్ దినోత్సవ లక్ష్యం Objectives of National science day

భారతదేశానికి సంబంధించిన ముఖ్యమైన సమస్యల పరిష్కారంలో మిగతా దేశాలతో మన దేశాన్ని సామవుజ్జీగా నిలపడంలో, ప్రపంచ స్థాయిలో అగ్ర నాయకత్వ స్థితికి చేర్చడంలో, ఇలా ఇంకా ఎన్నో సాధించడంలో శాస్త్ర సాంకేతిక రంగాల పాత్ర, శాస్త్రజ్ఞుల పాత్ర విలువ కట్టలేనిది. జాతీయ స్థాయిలో సైన్స్ స్ఫూర్తిని చాటడం, వ్యాప్తి చేయడం ఈ నేషనల్ సైన్స్ డే లక్ష్యం. విజ్ఞాన శాస్త్రం యొక్క ప్రాముఖ్యత మరియు దాని ఉపయోగాలను మన భారత ప్రజలకు తెలియజేయడం జాతీయ సైన్స్ దినోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశం.

సైన్స్ దినోత్సవం రోజున పాఠశాల మరియు కళాశాలలో విద్యార్థులు ప్రదర్శనలు ఏర్పాటు చేస్తారు. ఈరోజు విద్యార్థులు విజ్ఞానశాస్త్రంలో తమ ఆసక్తులను సమాజ అవసరాలను ప్రతిబింబింప చేస్తూ అనేక రకాల ప్రదర్శనలు ఏర్పాటు చేస్తారు. జాతీయ సైన్స్ దినోత్సవం రోజున అన్ని ప్రభుత్వ జాతీయ సంస్థల్లోకి (DRDO, ISRO వంటి సంస్థల్లోకి) ఎటువంటి ముందస్తు అనుమతి లేకుండానే సందర్శనకు అనుమతినిస్తారు.

రామన్ ఎఫెక్ట్ Raman Effect

విశ్వవిఖ్యాత సైంటిస్టు ‘భారతరత్న’, భారతీయ భౌతిక శాస్త్రవేత్త డాక్టర్ సి.వి.రామన్, సిద్ధాంతీకరించిన రామన్ ప్రభావం అంటే ఏమిటో అర్థం చేసుకోవడం అంత తేలిక కాదు. శ్రమ పడితే కానీ అర్థం కాదు. కాంతి కిరణాలు ద్రవాల పై పడినప్పుడు ఎలా పరిక్షేపం చెందుతాయో (చెదురుతాయో) తెలిపే పరిశోధన ఫలితాన్ని’ రామన్ ఎఫెక్ట్’ అంటారు.

కాంతి ఒక పదార్ధం మీద పడినప్పుడు ఆ కాంతి లోని కిరణాలు ఆ పదార్థంలోని అణువులను గుద్దుకుంటాయి. గోడ మీదకి బంతిని విసిరితే ఆ బంతి పరావర్తనం చెంది వెనక్కి వస్తుంది. అదే విధముగా కాంతి ఒక యానకం లోని రేణువులను గుద్దుకున్నప్పుడు ఆ కాంతి కిరణాలు పరావర్తనం చెంది వెనక్కి వస్తాయి. కాంతి కిరణంలోని తేజాణువులనీ రంగు బంతులతో పోల్చవచ్చు. ఏ రంగు బంతిని యానకం మీదకి విసిరామో అదే రంగు బంతి తిరిగి వస్తే దానిని రేలి పరిక్షేపం అంటారు. ఏ రంగు కిరణం లోపలికి వెళితే అది పరావర్తనం చెంది అదే రంగుతో బయటికి వస్తే ఆ ప్రక్రియని రేలి పరిక్షేపం అంటారు. భౌతిక శాస్త్రంలో కాంతి కెరటం యొక్క తరంగ దైర్గ్యమ్ రంగుని సూచిస్తుంది. పతనమైన కాంతి కిరణం ఒకటైతే పరావర్తనం చెంది తిరిగి వచ్చిన కిరణాలలో కొన్నింటి రంగు తేడాగా ఉంటుంది. ఈ ద్విగ్విషయానికి రామన్ ప్రభావం అని పేరు పెట్టారు.

నీటికి రంగు, రుచి, వాసన లేని పదార్ధమని అందరూ అంటుంటారు. గాజు గ్లాసులో పోసిన నీరు రంగు లేనట్లే కనిపిస్తుంది. కానీ లోతుగా ఉన్న జలాశయాలలోను, సముద్రంలోను నీరు నీలంగా కనిపిస్తుంది. ఇలా కనిపించడానికి కారణం నీటికి ఉన్న సహజమైన లేత నీలి రంగే, తెల్లటి సూర్యరశ్మి నీటి మీద పడినప్పుడు ఆ సూర్యకిరణాలలోని ఎరుపు రంగుని నీరు పీల్చుకొని మిగిలిన నీలిరంగు ని బయటికి వెలుగక్కుతుంది. దీనినే పరిక్షేపం చెందడం లేదా చెదరడం అంటారు. దూరం నుండి సముద్రాన్ని చూస్తే అది నీటికి ఉన్న సహజమైన లేత నీలి రంగులా కాకుండా ముదురు నీలిరంగులో కనిపిస్తుంది. దీనికి కారణం మనకి కనిపించే నీలి రంగులో కొంత సహజమైన లేత నీలి రంగు అయితే మరికొంత ఆకాశపు నీలిరంగు నీటిలో పరావర్తనం చెంది కనిపిస్తుంది. అందువలన సముద్రం ఆకాశం కంటే నీలంగా అనిపిస్తుంది. సముద్రం ఎక్కువ నీలంగా కనిపించడానికి ఇతర కారణాలు ఉన్నాయి అన్న ఆలోచన చివరికి రామన్ ప్రభావానికి దారి చూపింది.

కాంతి కిరణాలు ద్రవ పదార్థంపై పడినప్పుడు ఆ కాంతి పరిక్షేపం చెందుతుంది. కిరణం లోని కిరణాలలోని ఫోటాన్ కణాలు లేదా తేజాణువుల ద్రవపదార్థాల అణువుల పై పడి పరిక్షేపం చెందుతాయి. చెదిరిన తేజాణువులలో సింహభాగం వాటి పూర్వపు తరచుదనాన్ని కోల్పోవు. కొన్ని మాత్రం కాసింత తక్కువ తరచుదనం తో పరిక్షేపం చెందుతాయి. అంటే పడిన కాంతిలో కొంత భాగం మాత్రం వేరే తరచు దనంతో సంతరించుకుంటుంది. ఈ ప్రభావాన్ని రామన్ ఎఫెక్ట్ అంటారు. రామన్ ప్రభావం మొట్టమొదటిసారిగా ప్రయోగశాలలో ప్రత్యక్షంగా చూపించినది. సర్ సి.వి. రామన్ దీన్ని కనుగొన్నందుకు 1930లో నోబెల్ బహుమతిని అందుకున్నారు.

రామన్ ఎఫెక్ట్ వివరణ

రామన్ పరిక్షేపం సమగ్రంగా అర్థం కావాలంటే భౌతిక శాస్త్రం లో ‘గుద్దుకోవడం’ లేదా ‘సంఘాతం’ అని అంటారు. ఉదాహరణకి ఒక బల్ల మీద బంతులని తీసుకొని రెండు బిలియన్ గొంతులు సమాన వేగంతో ఎదురెదురుగా వచ్చి ఢీకొని పరావర్తనం చెంది, వేగంలో నష్టం లేకుండా వెనక్కి ప్రయాణం చేసాయి అనుకుందాం. ఈ రకం సంఘాతాన్ని ఉత్తమ సంఘాతం అని కానీ ఉత్తమ స్థితి స్థాపక సంఘాతం అని అంటారు. పరిక్షేపం చెందే సందర్భంలో తేజాణువులపాత్ర ఉంటే దానిని దృశ్య పరిక్షేపం అంటారు. తేజాణువు ఎలక్ట్రాన్ ను గుద్దుకున్నప్పుడు జరిగే స్థితిస్థాపక పరిక్షేపాన్ని థామ్సన్ పరిక్షేపం అంటారు. ఒక యానకంలో ఉన్న రేణువుల పరిమాణం ఆ రేణువుల మీద పతనమయ్యే తేజాణువు పరిమాణం కంటే బాగా చిన్నవి అయినప్పుడు జరిగే పరిక్షేపణం రేలి పరిక్షేపం అంటారు.

నిజానికి ప్రకృతిలో జరిగే సంఘాతాలు శుద్ద సంఘాతాలు కావు. ఉదాహరణకి ఒక బంతిని h మీటరు ఎత్తు నుండి నేల మీదికి జారవిడిస్తే అది నేలకు తగిలి తిరిగి పైకి లేస్తుంది.  కానీ పూర్తిగా h మీటర్లు లేవలేదు. ఎందుకంటే ఆ బంతి కొంత శక్తిని నష్టపోతుంది కనుక ఇది అస్థితిస్థాపక సంఘాతమ్ అని అంటారు. ఈ కోవకు చెందే రామన్ పరిక్షేపం. ఇక్కడ ఒక తేజాణువు ఒక పదార్థపు అణువుల మీద కానీ పతనం అయినప్పుడు ఆ రేణువులు కి స్వతహాగా ఉండే ప్రకంపన [vibrational] ప్రదక్షణ[rotational] శక్తులని మార్చివేస్తుంది. కెప్టెన్ పరిక్షేపం కూడా అస్థితిస్థాపక పరిక్షేపమె. ఇక్కడ ఒక తేజాణువు స్వాతంత్ర ప్రతిపత్తి ఉన్న ఎలక్ట్రాన్ ను ఢీకొనడం జరుగుతుంది.

 రామన్ ఎఫెక్ట్ ఉపయోగాలు

  • రేడియో ధార్మికత, అణుశక్తి, పరిమాణ బాంబు వంటి విషయాలను తెలుసుకోవచ్చు.
  • వివిధ రకాలైన మందులు ఔషధాలు డి.ఎస్. ఏ. పై చూపే ప్రభావాన్ని అంచనా వేయొచ్చు..
  • వాతావరణంలో కాలుష్యం CO2, CO, SO2,O3 ఉనికిని గుర్తించవచ్చు.
  • కార్బన్ రసాయన పదార్థాల అమరికలు వలయాలను కనుగొని ఆరోమాటిక్ స్వభావ నిర్ణయం వీలవుతుంది.
  • మిశ్రమ లోహాలు, అలోహాలు ప్రవాహ స్థితిలోనున్న లోహాల స్వభావ నిర్ణయం వీలవుతుంది.
  • కాంతి స్వభావ నిర్ధారణ వస్తువులతో కాంతికి గల పరస్పర చర్యా విధానం పదార్ధ ఉపరితలాలపై కాంతి క్రియా విధానం విషయాలు అధ్యయనం చేయవచ్చు.
  • ఘన పదార్థాల స్పటిక స్థితి, ద్రావణీయత, విద్యుత్ సంఘటనం విషయాలు తెలుసుకోవచ్చు.
  • ఆమ్లజని, నత్రజని వంటి సజాతి కేంద్రక అణువుల్లో కంపన మరియు బ్రామన శక్తి స్థాయి తెలుసుకోవచ్చు.
  • స్పటిక లో పరమాణువుల అమరిక స్పటిక జాలకం, స్పటికీకరణ జల వంటి విషయాలను తెలుసుకోవచ్చు.
  • మానవ శరీరంలోని ప్రోటీన్లు, అమినో ఆమ్లాలు, ఎంజైములు, న్యూక్లియన్ల పరిమాణాత్మక, విలువలు కనుగొనవచ్చు.
  • మధుమేహం, క్యాన్సర్ రోగుల ప్లాస్మా పరీక్ష, కండరాల నొప్పులు, బలహీనతలకు లోనైన వ్యక్తుల జన్యులోపాలను, రామన్ ఫలితంతో తెలుసుకోవచ్చు.
  • పరిశ్రమల్లో కృత్రిమ రసాయనిక సమ్మేళనాల పరిశీలనకు ఉపయోగపడుతుంది.
  • వైద్యరంగంలో అవసరమయ్యే మందుల విశ్లేషణకు రామన్ ఫలితం ఉపయోగపడుతుంది.

నేషనల్ సైన్స్ డే థీమ్స్ Themes of National Science Day

  • 1999-Our Changing Earth
  • 2000-Recreating Interest in Basic Science
  • 2001-Information Technology for Science Education
  • 2002-Wealth From Waste
  • 2003-50 years of DNA & 25 years of IVF – The Blue print of Life
  • 2004-Encouraging Scientific Awareness in Community
  • 2005-Celebrating Physics
  • 2006-Nurture Nature for our future
  • 2007-More Crop Per Drop
  • 2008-Understanding the Planet Earth
  • 2009-Expanding Horizons of Science
  • 2010-Gender Equity, Science & Technology for Sustainable Development
  • 2011-Chemistry in Daily Life
  • 2012-Clean Energy Options and Nuclear Safety
  • 2013-Genetically Modified Crops and Food Security
  • 2014-Fostering Scientific Temper
  • 2015-Science for Nation Building
  • 2016-Scientific Issues for Development of the Nation
  • 2017-Science and Technology for Specially Abled Persons
  • 2018-Science and Technology for a sustainable future
  • 2019-Science for the People, and the People for Science
  • 2020-Women in Science
  • 2021-Future of STI: Impact on Education Skills and Work
  • 2022-Integrated Approach in S&T for Sustainable Future
  • 2023-Global Science for Global Wellbeing
  • 2024-Indigenous Technologies for Viksit Bharat

National Science day Speeches in English ( Useful for Teachers & Students )

DOWNLOAD

Science day Online Quiz 

సూచన: విద్యార్థులను వివిధ గ్రూపులుగా విభజించి ఆయా గ్రూపులను IFP లు ఉన్న తరగతి గదులలో కూర్చో బెట్టి IFP పై సమాధానాలు గుర్తించి సబ్మిట్ చేసే విధంగా ప్రోత్సహించండి.

CLICK HERE

Science day Songs  

Song-1: సైన్స్ ఏ నిన్న నేడు- సైన్స్ ఏ రేపు మాపు 

Song-2: ఎ.పీ. జే అబ్దుల్ కలాం 

Song-3: విజ్ఞాన శాస్త్రము వికసించు శాస్త్రము

Song-4: సైన్స్ ఏరా జగతికి మూలం 

About… C V RAMAN & National Science Day in English

DOWNLOAD

Read also..

C.V.Ramanujan Biography

CLICK HERE

Trending Information
error: Content is protected !!